- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MP Kiran Kumar: ఎలన్ మస్క్ చేతుల మీదుగా కేటీఆర్‌కు సన్మానం
దిశ, వెబ్‌డెస్క్: నిరంకుశ, దౌర్భాగ్య పాలనను తరిమికొట్టి ప్రజలు ప్రజాస్వామ్య పాలనను తెచ్చుకున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఒక్క సీటు గెలవని పార్టీ.. వచ్చే ఎన్నికల్లో వందసీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఆరు నెలల క్రితమే బీఆర్ఎస్(BRS)కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని గుర్తుచేశారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. 16 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని అన్నారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్(KTR)కు ఎలన్ మస్క్(Elon Musk) తప్పకుండా సన్మానం చేస్తారని సెటైర్ వేశారు.
బీజేపీ(BJP) కార్యాయలంలో ప్రతిపక్ష నేతకు సొంత గది కూడా లేదని.. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ఆదరణ వస్తోందని అన్నారు. రైతులు, మహిళలు, చిన్నారులు, నిరుద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. మూసీ పునరుజ్జీవంతో అందమైన నదిగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ప్రజల్లో ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసే బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీల నేతల మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.