Congress MLC: మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-10 16:00:39.0  )
Congress MLC: మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల(Journalists) పట్ల దారుణంగా ప్రవర్తించిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)ను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధితపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇది అమానుషమైన ఘటన అని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్త చేస్తున్నాయి. తక్షణమే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితం మంచు మనోజ్‌తో పాటు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి పలువురు జర్నలిస్టులు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు జర్నలిస్టులను బండ బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు.

Read More...

Manchu: భార్య మాటలు విని చెడు మార్గంలో.. కొడుకుపై మోహన్ బాబు సంచలన ఆడియో

Next Story