Breaking News : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటన

by M.Rajitha |   ( Updated:2025-03-09 14:13:21.0  )
Breaking News : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల(MLA Quota MLC Cnadidates) వివరాలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. విజయశాంతి(Vijayashanthi), అద్దంకి దయాకర్(Addanki Dayakar), కేతావత్ శంకర్ నాయక్(Kethavath Shankar Nayak) లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం(AICC) ప్రకటన జారీ చేసింది. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈనెల 20న ఎన్నికలు జరగగా.. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. కాగా ఈ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ పెద్దలు రాష్ట్ర నాయకులతో కీలక చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య చర్చలు జరిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ చేసినందుకు గాను సీపీఐకి ఒక స్థానాన్ని కాంగ్రెస్ కేటాయించింది.

Next Story