ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్

by GSrikanth |
ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్
X

దిశ, వెబ్‌డెస్క్: హవాలా, ఫెమా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు ఆయనపై ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో గురువారం అధికారుల ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధులు డిపాజిట్లు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల డిపాజిట్లు చేసినట్లు సమాచారం. నిధుల డిపాజిట్లకు సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story