- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ‘నాకు మంత్రి పదవి ఇప్పించండి’.. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: ఆరు కేబినెట్ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి(Sankranthi)లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నాలుగు ఉమ్మడి జిల్లాలు, ఆరు సామాజికవర్గలకు ప్రస్తుతం కేబినెట్(Telangana Cabinet)లో స్థానం లేదు. దీంతో అన్ని లెక్కలు చూసుకొని.. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు. అధిష్టాన పెద్దలను కలిసి తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క(Bhatti Vikramarka)ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) కలిశారు. మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించాలని భట్టిని కోరినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అధిష్టానం పెద్దలకు సైతం మల్‌రెడ్డి లేఖలు రాశారు. తన జిల్లా నుంచి ఎవరూ ప్రాతినథ్యం వహించడం లేదని.. తనకు ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసీసీతో సన్నిహితంగా ఉండే సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఏదైనా కారణంతో కేబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత తప్పక ఉంటుందని పార్టీ నేతల అంచనా. దీంతో మంత్రి వర్గ విస్తరణపై ఆశావహుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. అయితే.. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ ఓకే చెబితే ఎంత మందికి చాన్స్ ఇస్తారనే దానిపైనా నేతల్లో టెన్షన్ నెలకొన్నది. లిస్టులో తమ పేరు ఉంటుందా? ఉండదా? అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్.