- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎందుకు ఉండాలి..?
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం పేరు ఎందుకు ఉండాలి? అంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పేరును ముద్రించిన అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. ఫస్ట్ టైమ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా పాఠ్య పుస్తకాలతో పాటు, నోట్ బుక్స్‌ను అందిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా, మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేశామన్నారు. పుస్తకాలలో మాజీ సీఎం పేరు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అయితే కేసీఆర్ పేరు ఉంటే తప్పేమీ? అని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎక్కడా వృథా చేయడం లేదన్నారు. ఎమ్‌ఈవో కార్యాలయంలోనే మొదటి పేజీ తొలగించి, మరో పేజీని జత చేస్తున్నామన్నారు. విద్యార్ధులకు సరైన సమాచారం ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడతారన్నారు. అన్ని సబ్జెక్టులలో ఇలాంటి తప్పిదం జరగలేదన్నారు. తెలుగు సబ్జెక్టులోని ఓల్డ్ స్టాక్ బుక్స్‌లో మాత్రమే ఇది జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లామని, ప్రజలు తమకు ఓట్ల శాతాన్ని పెంచుతూ మద్దతిచ్చారన్నారు. బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు తమకే పడ్డాయన్నారు. ప్రతి మండలానికి ఓ రెసిడెన్షియల్ స్కూల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తుందన్నారు.