Beerla Ilaiah: హరీష్ రావు కారణంగా అపవిత్రమైన యాదాద్రి ఆలయం

by Gantepaka Srikanth |
Beerla Ilaiah: హరీష్ రావు కారణంగా అపవిత్రమైన యాదాద్రి ఆలయం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి ఆలయాన్ని బీఆర్ఎస్ నేతలు అపవిత్రం చేశారని కాంగ్రెస్ కీలక నేత, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడి మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాన్ని మైల పట్టించారని కీలక ఆరోపణలు చేశారు. దీనికి హరీష్ రావు పొర్లు దండాలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. అసలు రాష్ట్రంలో ప్రజలు ఎవరూ బీఆర్ఎస్ డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. గురువారం ఉదయం హరీష్ రావు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి వారిని క్షమించండి అని.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినట్టు హరీష్ రావు వివరించారు. అనంతరం దేవుడి సన్నిధిలో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు మాట్లాడి అపవిత్రం చేశారని కాంగ్రెస్ నేతలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.




Advertisement

Next Story