- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కుల్లో కాంగ్రెస్ మంత్రి!.. ఎంపీ ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బండి సంజయ్
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎంపీ ఎన్నికల వేళ మార్ఫింగ్ వీడియో, రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దు అంశాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రంజుగా మారింది.దీంతో నిన్నా మొన్నటి వరకు హాట్ టాపిక్ గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు పై చర్చ పక్కదారి పట్టింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను కాపాడేందుకు ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంపీ ఎన్నికల వేళ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా దుమారంగా మారాయి. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు చెప్పారని ఈ విషయం పోలీసుల స్టేట్ మెంట్ లో రికార్డు అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను కరీంనగర్ కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని, ఆ మంత్రి చేతుల మీదుగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు చెందిన డబ్బులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులకు, ఢిల్లీకి చేరాయని ఆరోపణలు గుప్పించారు. అంతే కాకుండా నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని ఈ కేసులో తనతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కూడా బాధితులే అన్నారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతలపై చర్యలేవని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి పంథాను అనుసరించిందో కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథాను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూములు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, టీఎస్ పీఎస్సీ లీకులు వంటి అనేక అంశాల్లో సిట్ వేసి వీటిలో వాస్తవాలు ప్రజలకు వెల్లడించకుండా పూర్తిగా నీరుగార్చిన విషయం అందరికీ తెలిసిదేనని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును అదే విధంగా నీరు గారుస్తోందన్నారు.
ఆయనకు టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావే:
కరీంనగర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావు ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న అశోక్ రావు.. ప్రభాకర్ రావు వియ్యంకుడు అని వీరిద్ధరి మధ్య ఉన్న బంధుత్వంతోనే ప్రభాకర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ రావు ఇంట్లోనే ఉండి ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నదని ముందుగానే పసిగట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు కరీంనగర్ ప్రతిమ హోటల్ 314 రూమ్ నెంబర్ లో ఉన్నారని. హోటల్ రికార్డులో వారి పేర్లు రాయకుండా బిల్లులు చెల్లించకుండా అక్కడే తిష్ట వేసి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాజేందర్ రావుకు టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావే అని రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధమే లేదని ఆయన ఏనాడు కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొనలేదు ఆ పార్టీ జెండా మోయలేదన్నారు. వెలిచాల రాజేందర్ రావు ఆర్థిక వ్యవహారాలన్ని అశోక్ రావే చూసుకుంటారని రాజేందర్ రావు ఇప్పటికీ అశోక్ రావు ఇంట్లోనే ఉంటున్నారన్నారు.
మంత్రికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు ప్లాన్ ప్రకారం రాజేందర్ రావును తెరమీదకు తీసుకువచ్చారని ఆరోపించారు. కరీంనగర్ కు సంబంధిచిన మంత్రి అశోక్ రావును ముఖ్యమంత్రి కలిపించారని కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఢిల్లీ పార్టీ పెద్దల వరకు ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు ముట్టాయని బండి ఆరోపించారు. రాజేందర్ రావుకు ఏ విధంగా టికెట్ వచ్చింది? ప్రభాకర్ రావు మంత్రి ద్వారా ఇచ్చిన డబ్బులు ఎవరెవరికి ముట్టాయి? మంత్రికి కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్య సంబంధం ఏమిటి? అనేది తేల్చాలన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు ఢిల్లీ వరకు ముట్టాయంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏ స్థాయిలో కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరాలని లేకుంటే ఈ కేసులో మీకు సంబంధం ఉన్నట్లే అన్నట్లే అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోతున్నదని తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు గెలబోతున్నదన్నారు. కేసు సీబీఐకి అప్పగిస్తే తన వద్ద ఉన్న ఆరోపణలను సీబీఐకే ఇస్తానన్నారు