- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kaushik Reddy vs Congress : డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు..కౌశిక్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్ : జన్వాడ ఫాం హౌస్(Janwada Farm House) ఘటన నేపధ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)కి, కాంగ్రెస్ నేతలకు మధ్య చోటుచేసుకున్న డ్రగ్ టెస్టుల సవాళ్ళు..ప్రతి సవాళ్ళ మధ్య బుధవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్( MP Anil Kumar Yadav), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) లు డ్రగ్స్ టెస్టు(drug tests)ల కోసం శాంపిల్స్ ఇచ్చారు.జన్వాడ ఫాం హౌస్(Janwada Farm House) ఘటన నేపధ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)కి, కాంగ్రెస్ నేతలకు మధ్య చోటుచేసుకున్న డ్రగ్ టెస్టుల సవాళ్ళు..ప్రతి సవాళ్ళ మధ్య బుధవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్( MP Anil Kumar Yadav), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) లు డ్రగ్స్ టెస్టు(drug tests)ల కోసం శాంపిల్స్ ఇచ్చారు.హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్ కు వచ్చిన వారిద్దరు కూడా డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్, బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో భార్య, కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లు బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన కౌశిక్ రెడ్ది ఓ ఆంబోతులా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
తన స్థాయికి మించి సీఎం రేవంత్ రెడ్డిపైన, మంత్రులపైన విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తన బాస్ కేటీఆర్ ను, బీఆర్‌ఎస్ 28 మంది ఎమ్మెల్యేలను తీసుకుని డ్రగ్ టెస్టులకు వస్తానమని, ఎంపీ అనిల్ కుమార్ కూడా టెస్టులకు రావాలని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ కు స్పందించి మేం ఈ రోజు డ్రగ్ టెస్టులకు మా శాంపిల్స్ ఇచ్చామన్నారు. కాని సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి, ఆయన బాస్ పత్తా లేరని ఎద్దేవా చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడనే అనుమానం ఉందని, ఆయన కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని బల్మూరి డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పాల్సివచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు రాష్ట్రాన్ని డ్రగ్ రహితంగా మార్చాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష కేటీఆర్ కుటుంబం డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు.