- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ కాంగ్రెస్లో సీఎం రేసుపై చర్చ.. వీహెచ్, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఫలితాలతో టీకాంగ్రెస్ పై చర్చ మొదలైంది. పక్క రాష్ట్రంలోని హస్తం నేతలు ఎన్నికల తర్వాత ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు మాత్రం సమిష్టిగా పని చేయడం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో వేరువేరుగా మాట్లాడిన వీరిద్దరు తాము సీఎం రేస్ లో లేమని, పార్టీ విజయమే తమకు ముఖ్యమన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్నారు. అధికార బీఆర్ఎస్ లోనే వర్గపోరు, కుమ్ములాటలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం మాత్రం ఖాయం అన్నారు. కర్ణాటక ఫలితాలతో పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో సీఎం అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు.
నా ప్రయత్నం నేను చేస్తున్న: వీహెచ్
కర్ణాటక ఇష్యూపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరిని కలుపుకుని పోతే తప్పక సక్సెస్ అవుతామన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం లేదని తాను చెప్పడం లేదని అన్నారు. అందరినీ కలుపుకుపోవడానికి రేవంత్ ప్రయత్నిస్తునే ఉన్నారని, నేను కూడా కలిసి పోవడానికి, ఇతరులను కలుపుకు పోవడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నానని పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అంతిమంగా అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుందని ఎవరికి పదవులు రావాలన్నా కాస్త ఓపికగా ఉండాలన్నారు. తనకు పార్టీనే ముఖ్యమని సీఎం రేస్ లో తాను లేనన్నారు. ఇప్పటికే ఈ రేస్ లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయని తాను మాత్రం ముఖ్యమంత్రి రేస్ లో లేనని స్పష్టం చేశారు.
Also Read..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం.. కేసీఆర్కు వినుతుల వెల్లువ