సిరిసిల్లలో రెచ్చిపోతున్న బీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్‌పై చార్జ్ షీట్!

by GSrikanth |
సిరిసిల్లలో రెచ్చిపోతున్న బీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్‌పై చార్జ్ షీట్!
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చార్జిషీట్ విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ అండతో అనుచరులు విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేగాక, కమీషన్‌ ఇవ్వని చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడ లేదని ఆవేదన చెందారు. డబుల్ బెడ్ ఇళ్ల కేటాయింపులో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి రూ.1 లక్ష చొప్పున వసూలు చేశారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మి్స్తామని హామీ ఇచ్చిన కేటీఆర్, గెలిచాక విస్మరించారని విమర్శించారు.

మంత్రి అసమర్థత కారణంగా నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కాలేదని, మంత్రి అనుచరులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔషధాలను అక్రమంగా దోచేసి ప్రవేట్ ఫార్మసీలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వరకు నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కేటీఆర్ మోసం చేశారని అన్నారు. మంత్రి అండ చూసుకొని అతడి బావమరిది నియోజకవర్గంలోని అమాయక విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. అంతేగాక, మంత్రి అండతో మున్సిపల్ చైర్మన్ భర్త నియోజకవర్గంలో కోట్లు విలువ చేసే భూములను ఆక్రమిస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story