T- కాంగ్రెస్‌లో కమిటీల కల్లోలం.. భట్టి ఇంట్లో కీలక భేటీ

by Satheesh |   ( Updated:2022-12-12 14:20:19.0  )
T- కాంగ్రెస్‌లో కమిటీల కల్లోలం.. భట్టి ఇంట్లో కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ కమిటీలు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి. సీనియర్లు, జూనియర్లంటూ ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతోన్న టీ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు కొత్త చిచ్చు రేపాయి. ఏఐసీసీ ప్రకటించిన కమిటీల పట్ల చాలా మంది నాయకులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొండా సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబర్ పదవికి రాజీనామా చేశారు.

ఆమె బాటలోనే కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ సైతం తీవ్ర అసంతృప్తితో పార్టీ పదవికి రాజీనామా చేశారు. సీనియర్ నేతనైనా తనకు కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై బెల్లయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. కొత్తగా ప్రకటించిన కమిటీల పట్ల అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కరు ఒక్కరుగా వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో.. అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో పీసీసీ కమిటీల నియామకంపై చర్చించేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. భట్టి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి భేటీ అయ్యి చర్చిస్తు్న్నారు.

READ MORE

డిస్కో ఆడించిన పాపం ఊరికే పోదు: MP బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: లోక్‌సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed