రానున్న ఎన్నికల్లో BRS పని ఖతం: వినోద్​రెడ్డి

by Satheesh |
రానున్న ఎన్నికల్లో BRS పని ఖతం: వినోద్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు కాంగ్రెస్​భయం పట్టుకున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మిట్టకంటి వినోద్​రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా కాంగ్రెస్​కేడర్​పెరుగుతున్నదని, దీన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్​భౌతిక దాడులకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్​పని ఖతం అవుతున్నదని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్‌ఎస్ పార్టీకి ఎంత భయమో జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఘటన తేటతెల్లం చేస్తోందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడాన్ని చూసి బెంబేలెత్తిన బీఆర్‌ఎస్​నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం దారుణమన్నారు.

కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ వ్యభిచారిగా మారి పార్టీ ఫిరాయించడమే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల పైకి రాళ్లతో దాడి చేయించాడన్నారు. ధైర్యం ఉంటే నేరుగా తలపడాలి కానీ, దొంగచాటుగా కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక భౌతిక దాడులకు ప్రేరేపించడం సరికాదన్నారు. కొద్దిరోజుల క్రితం వరంగల్ లోనూ యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ మీద కూడా బీఆర్ఎస్​నాయకులు దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్నికల సమరంలో ప్రజలే బీఆర్‌ఎస్​కు తగిన బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed