‘రెజ్లర్స్​ ఏడుస్తుంటే, బీజేపీ సంబురాలు చేస్తుంది’

by GSrikanth |   ( Updated:2023-06-01 14:27:14.0  )
‘రెజ్లర్స్​ ఏడుస్తుంటే, బీజేపీ సంబురాలు చేస్తుంది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలను అవమానపరిచేలా ఇబ్బంది పెట్టిన బ్రిజ్​భూషణ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టీపీసీసీ మహిళా అధ్యక్షురావు సునీతారావ్ పేర్కొన్నారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి మెడల్స్​తెచ్చిన మహిళలను అవమానాలకు గురిచేయడం సరికాదన్నారు. రెజ్లర్స్ ఏడుస్తుంటే, బీజేపీ సంబురాలు చేసుకుంటుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు ఎక్కడికి? వెళ్లాయో? స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గత 3 నెలల నుండి మహిళా రెజ్లర్స్ హక్కుల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి పట్టింపులేకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. బ్రిజ్ భూషన్ మహిళా రెజ్లర్స్‌ని సెక్సువల్‌గా అబ్యూస్ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నా.. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిని అవలంభించడం సరికాదన్నారు.

ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఎందుకు స్పందించడం లేదు..? అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ నూతన భవనం ఓపెనింగ్ రోజు మహిళా రెజ్లర్లు న్యాయ పోరాటం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం దురుసు చర్యలో నేషనల్ ఫ్లాగ్ సైతం కింద పడిందని గుర్తుచేశారు. బీజేపీకి పోయే కాలం వచ్చిందని, 50 శాతం ఓటు బ్యాంక్​కలిగిన మహిళలే బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మహిళా రెజ్లర్లపై లైంగిగా వేధింపులు జరుగుతున్నా.. మోడీ, అమిత్​షాలు ఎందుకు? మాట్లాడం లేదని సునీతారావు ఫైర్ అయ్యారు. బ్రిజ్​భూషన్​ఎవిడెన్స్‌ను మాయం చేసినందునే, ఇప్పుడు ఆధారాలు చూపితే ఉరివేసుకుంటానని ప్రకటిస్తున్నాడని చెప్పారు. బ్రిజ్​భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే, దేశ వ్యాప్తంగా మహిళ ఉద్యమాలను మొదలవుతాయని హెచ్చరించారు.

Also Read..

దశాబ్ది ఉత్సవాలు కలిసి వచ్చేదెవరికి? బెడిసికొట్టేదెవరికి?

Advertisement

Next Story