- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janwada Rave Party: కేటీఆర్.. దమ్ముంటే టెస్ట్ కి రా : శోభారాణి డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: జన్వాడ ఫాం హౌస్ (Janwada Farmhouse Rave Party)లో రేవ్ పార్టీ ఘటన.. తెలంగాణలో సంచలనం రేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Brs Working President KTR) కు బావమరిది అయిన రాజ్ పాకాలను ఈ కేసులో ఏ2 నిందితుడిగా చేర్చారు పోలీసులు. రేవ్ పార్టీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత శోభారాణి (Congress leader Shobharani) సైతం కేటీఆర్ పై విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత (Drug free State) రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే.. కొందరు బడా నేతలు మాత్రం ఫాంహౌస్ లలో ఇలా డ్రగ్ పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారామె. నిన్న జరిగిన డ్రగ్ పార్టీలో 35 మంది పట్టుబడ్డారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నారో అర్థమవుతుందన్నారు. నిన్న జరిగిన రేవ్ పార్టీలో మీరున్నారో లేదో బహిర్గతం చేయాలని, అందుకు బ్లడ్ శాంపిల్ ను టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేటీఆర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్ వేదికగా మాట్లాడే కేటీఆర్ ఇప్పుడు డ్రగ్ పార్టీపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్ పార్టీలకు మూలం కేటీఆర్ ఫాంహౌసేనని , అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్నారు. కేటీఆర్ ఫాంహౌస్, ఆయన బావమరిది ఫాంహౌస్ లో వెంటనే సెర్చ్ చేయాలని తెలంగాణ పోలీసుల్ని కోరుతున్నట్లు శోభారాణి తెలిపారు.