- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనియాకు ముందే తెలుసు.. సంచలన విషయం బయటపెట్టిన ప్రియాంక గాంధీ..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు.. తెలంగాణ వస్తే రైతుల జీవితం బాగుపడుతుందని మీరు ఆశించారు.. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమనే విషయం సోనియా గాంధీకి తెలుసని.. అయిన మీ కలల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బుధవారం ములుగు జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగా సభకు ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మీ ఆకాంక్షలు నెరవేరలేదని.. మీ ఆశలు, ఆశయాలు నేరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని తెలిపారు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతోందని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.