- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR కుటుంబానికి తప్పా.. ఉద్యమకారులెవ్వరికీ ఉద్యోగాలు రాలే: మహేష్ కుమార్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ ప్రకటించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జూన్ నుంచి గ్రామాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అమర వీరుల స్థూపం నుంచి గాంధీభవన్వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీ వేశామన్నారు. ఆవిర్భావ దినోత్సవాల్లో స్వరాష్ట్రం ఎవరి వల్ల ఏర్పడిందనేది స్పష్టంగా వివరిస్తామన్నారు. కేసీఆర్ప్రభుత్వంలో మోసాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ కార్యక్రమాలు చేస్తుందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర కోసం కష్టపడ్డ ఎంపీలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2న గాంధీ భవన్‌లో సన్మానిస్తామన్నారు. కేసీఆర్పాలనతో రాష్ట్రం నలిగిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షలు, స్వప్నాలు నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి స్థాయిలో నెరవేరలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి తప్పా..ఉద్యమకారులెవ్వరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచినోళ్లంతా ప్రస్తుతం కేసీఆర్ క్యాబినేట్‌లో ఉండటం బాధాకరమన్నారు. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు కొనసాగడం విచిత్రంగా ఉన్నదన్నారు. ప్రభుత్వ తప్పిదాలను బయటకు తీసి ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పిషరీస్చైర్మన్మెట్టు సాయికుమార్తదితరులు పాల్గొన్నారు.