- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలిసి మీరు కాడి కిందపడేసినప్పుడు వస్తా.. జానారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించానని, తనను ఇంకా ఆయాస పెట్టొద్దని పార్టీ నాయకులను కోరారు. అలిసి మీరు కాడి కిందపడేసినప్పుడు, మళ్లీ వచ్చి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అప్పటివరకు తాను రాలేదని అనుకోకండి.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదని, పెట్రోలు, డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించింది. గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ హయాంలో రూ.400లు ఉంటే ఇప్పుడు రూ.1100లకు చేరిందన్నారు. అసంపూర్తిగా దిండి, చర్లగూడెం, కిష్టనాయనపల్లె ఎత్తిపోతల ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం వదిలేసిందన్నారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు. చౌటుప్పల్ లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.