రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం దానిపైనే.. జై రామ్ రమేష్

by Satheesh |
రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం దానిపైనే.. జై రామ్ రమేష్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారని కాంగ్రెస్ కీలక నేత జై రామ్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. కానీ అధికారంలోకి వచ్చాక వెంకయ్యనాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్‌కు పూర్తిగా వీఆర్ఎస్ తప్పదు అని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే పెడతారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story