- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jaggareddy: కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి పౌరుషం ఉంటే ఆ పనిచేయాలి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కోతల రాయుళ్లు అని ఎద్దేవా చేశారు. అసలు కేంద్రమంత్రులు అయిన కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి పౌరుషం ఉంటే తెలంగాణకు ఐటీఐఆర్(ITIR)ను తీసుకురావాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో పరిపాలన హుందాగా జరుగుతోందని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ అసెంబ్లీలో సరిగా మైక్ ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చాలా సమయం ఇచ్చారని అభినందించారు. అంతేకాదు.. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని.. దీంతో ఎంతో మంది యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. డీపీఆర్ అడిగే హక్కు కేటీఆర్‌కు లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్, మూసీ ప్రక్షాళన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అసలు బీఆర్ఎస్ తమకు పోటీనే కాదని ఎద్దేవా చేశారు.