రేవంత్ రెడ్డితో ప్రాణహాని.. డీజీపీకి కాంగ్రెస్ నేత సంచలన ఫిర్యాదు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-25 10:30:17.0  )
రేవంత్ రెడ్డితో ప్రాణహాని.. డీజీపీకి కాంగ్రెస్ నేత సంచలన ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు డీజీపీ అంజనికుమార్ కు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కురవ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ పై స్పందించిన డీజీపీ తక్షణమే విచారణ చేపడతామన్నారు. ఈ సందర్భంగా కురవ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గద్వాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానన్నారు. కాంగ్రెస్ కోసం 15 ఏళ్లుగా పనిచేశానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల డబ్బులు, భూములు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకోలేదంటే భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్ రెడ్డి తమను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. తమకు ప్రాణ రక్షణ కల్పించాలన్నారు.

Advertisement

Next Story