- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం ఆదేశాలతోనే అక్రమ మైనింగ్‌లు.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం ఆదేశాలతోనే రాష్ట్రంలో అక్రమమైనింగ్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ పేర్కొన్నారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో అక్రమ మైనింగ్‌లు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన గన్ పార్క్‌వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్సన్మాట్లాడుతూ.. కేసీఆర్ అండదండలతోనే అక్రమ మైనింగ్‌లు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. తాము దీక్షకు దిగితే విఫలం చెయ్యడానికి సీఎం 100 మంది పోలీసులను పంపించారన్నారు. బండ రావిరాల, చిన రావిరాల, తారామతిపేట, దేశముఖిలోని సర్వే నెం.268లో 670 ఎకరాలలో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, రెడీ మిస్, హాట్ మిస్ ప్లాన్ లు చేస్తున్నారన్నారు.
సహజ వనరులను రహస్యంగా వెలికితీస్తున్నారన్నారు. ఆయా కంపెనీలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రశ్నించినోళ్లపై బెదిరింపులకు దిగుతున్నట్లు జడ్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్రమ మైనింగ్ పోరాట నాయకులు కృష్ణ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబు, ఉపేందర్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.