ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేలా చేయోద్దు! సీఎంరేంవత్‌కు కాంగ్రెస్ నేత పలు డిమాండ్లు!

by Ramesh N |
ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేలా చేయోద్దు! సీఎంరేంవత్‌కు కాంగ్రెస్ నేత పలు డిమాండ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్స్ 1, 2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల అభ్యర్థులు నష్టపోయారని వెంటనే ఈ జీవోను ఈ ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఇటీవల గురుకుల రిక్రూట్‌మెంట్‌లో 1:2 ప్రకారం అభ్యర్ధులను పిలిచారని, దీంతో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల గురుకులాల్లో స్టాఫ్ ఉండదని, దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. వెంటనే గురుకులాల్లో ఉన్న 4 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జరగబోయే క్యాబినెట్ మీటింగుల్లో ఈ విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేలా చేయవద్దని, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే ఆపోహ తనపై వేయోద్దన్నారు. ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని సూచించారు.

Advertisement

Next Story