తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. రాజ్యసభ అభ్యర్థి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. రాజ్యసభ అభ్యర్థి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేత కేకే రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సింఘ్వీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి పోటీ చేయడం సంతోషాన్నిస్తోందని అన్నారు. రేపు(సోమవారం) పార్టీ కీలక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మద్దతు సంపూర్ణంగా ఉందని అన్నారు. తెలంగాణ విభజన అంశాలపై రాజ్యసభలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఇవాళ జరగనున్న సీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలకు సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు.

Advertisement

Next Story