- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు కాంగ్రెస్ దీక్ష.. హాజరు కానున్న రేవంత్, ముఖ్య లీడర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఆదివారం గాంధీ భవన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనున్నది. రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ దీక్షలో కాంగ్రెస్ ముఖ్య లీడర్లు, టీపీసీసీ కమిటీ, మాజీఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హజరుకానున్నారు. దీంతో పాటు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను కూడా దీక్షలో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నది.
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కనీసం వెయ్యి మంది చొప్పున కార్యకర్తలను తీసుకువెళ్లాలని ఆయా ఇన్ చార్జీలు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని కాంగ్రెస్ కమిటీలు, డీసీసీ అధ్యక్షులు, కిసాన్ కమిటీలు, సోషల్ మీడియా టీమ్లు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కచ్చితంగా హజరు కావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలిచ్చింది. రాహుల్‌కు మద్దతుగా ఈ సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకున్నారు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీలపై తీసుకుంటున్న చర్యలు, విపరీతంగా పెరిగిన ధరలు, సామాన్యుడికి, కార్పొరేట్ వ్యక్తులకు బీజేపీ ఇస్తున్న ప్రయారిటీ వంటి వాటిపై కాంగ్రెస్నేతలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.