ఆ బ్యారేజీ కూలిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది: హరీశ్ రావు

by Mahesh |   ( Updated:2024-02-17 11:08:28.0  )
ఆ బ్యారేజీ కూలిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది: హరీశ్ రావు
X

దిశ, వెబ్‌‌డెస్క్: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంపై ఉదయం నుంచి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సభలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ అనే విధంగా చర్చ జరిగింది. కాళేశ్వరం కూలిపోవడానికి కారణం బీఆర్ఎస్ అని కాంగ్రేస్ ఎమ్మెల్యేలు ఆరోపించగా.. విచారణ జరిపిస్తే తాము దేనికైన సిద్దమే అని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఈ క్రమంలో సభ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కోసం వాయిదా పడింది. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తాము కట్టించిన బ్యారేజీలు కూలిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అందుకోసమే బ్యారేజీలకు మరమ్మతులు చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లు అనుమానం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోందని.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో కాళేశ్వరం పాజేక్టులో లోపాలున్నాయనే విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story