- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao : రైతు భరోసాపై కోతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుస్తీ : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : రైతు భరోసా(Rythu Bharosa)కు కోత(Cuts)లు విధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుస్తీ(Exercises)లు పడుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు(Harish Rao)విమర్శించారు. సంగారెడ్డిలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు యాసంగి ఎగవేసి, వానకాలంకు కోతలు పెడుతున్నాడన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీపై మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కోతలు పెడుతూ మరో మోసానికి సిద్ధపడుతున్నాడన్నారు. రైతు భరోసా కోసం సెల్ఫ్ డిక్లరేషన్లతో ధరఖాస్తులు చేయమంటున్నాడని, అన్నం పెట్టే రైతుకు షరతులు, డిక్లరేషన్ పేరుతో అవమానిస్తున్నారడని హరీష్ రావు మండిపడ్డారు. అన్నదాతలంటే అంత అలుసెందుకని..రైతులను మళ్లీ కార్యాలయాలు, కాంగ్రెస్ నేతల చుట్టు, పైరవీ కారుల చుట్టు తిప్పాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయంలో ఎలాంటి తిప్పలు లేకుండా టింగ్ టింగ్ మని రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్నారు. కేసీఆర్ హయాంలో ఎంత మందికి ఇచ్చారో అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీల మేరకు రైతు భరోసా ఎకరానికి 15వేలు ఇవ్వాలన్నారు.
పంటలు సాగుచేసిన వారికే రైతు భరోసా ఇస్తామంటు రేవంత్ రెడ్డి లీక్ లు ఇస్తున్నాడని, పత్తి వంటి వాణిజ్య పంటలు, పండ్ల తోటల రైతులకు ఒకసారి మాత్రమే ఇస్తామంటున్నాడని, అది ఆ రైతులకు నష్టం చేస్తుందన్నారు. వాటికి పెట్టుబడి కూడా ఎక్కువని, సాగునీటి వసతి ఎక్కువగా లేనివారే వాటిని సాగు చేస్తారన్నారు. కొండలు, గుట్టలలో పంటల సాగు అంతంత మాత్రమని, కోతలు పెడితే గిరిజన రైతులు నష్టపోతారన్నారు. కేసీఆర్ రైతుల గౌరవాన్ని పెంచితే కాంగ్రెస్ అడుక్కునేవాడిగా మార్చుతుందని విమర్శించారు. దీర్ఘకాలిక పంటలు, వర్షధారిత పంటలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రైతులే చేస్తారని, రైతు భరోసాలో వారికి అన్యాయం చేస్తే రైతాంగం తిరుగబడటం ఖాయమన్నారు.
కేసీఆర్ పూర్తి రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి షరతులు పెట్టి రైతు రుణమాఫీ సగం మందికే పరిమితం చేశాడని, పంటల బోనస్ ను పది రకాల పంటలకిస్తామని చెప్పి ఒక పంటకే పరిమితం చేశాడని విమర్శించారు. పంటల బీమా ఏడాదైన పత్తా లేదన్నారు. వ్యవసాయ పనిముట్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పాడి రైతులకు ప్రోత్సాహం ఇవ్వలేదని, 24గంటల కరెంటు 16గంటలకే పరిమితం చేశారన్నారు. 2లక్షలపైగా ఉన్న అప్పుల మాఫీ నేటికి చేయలేదన్నారు. ఎప్పుడు వారికి రుణమాఫీ చేస్తరో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి వడ్డీ భారం పెరిగిపోతుందన్నారు.
భూమిలేని పేదలకు ఇస్తామన్న 12వేల సహాయంపై కూడా కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పథకంలోనూ షరతులు, కోతలతో ఎగవేత ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.850కోట్ల ఉపాధి హామా పథకం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి కూలీలకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చిందన్నారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే వాటికి కేంద్రానికి వడ్డీలు చెల్లించాల్సి ఉందన్న సోయి లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో స్పర్శ పథకంతో నేరుగా కూలీలకే కేంద్రం డబ్బులు చెల్లించబోతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో నేరాల రేటు పెరిగిందన్నారు. దేశంలో బెస్ట్ పోలీస్ గా ఉన్న తెలంగాణ పోలీసులను పనిచేయనివ్వకుండా రాజకీయ కక్షలకు వాడుతు రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడని హరీష్ రావు విమర్శించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామని చెప్పి అధికారిక చిహ్నాలు మార్చే పని పెట్టుకున్నారని, లోగోలు కూడా పోలీసు శాఖకు నిధులిచ్చి బలపేతం చేయాలన్నారు. పోలీసు ఉద్యోగులకు టీఏ 15నుంచి 7రోజులకు తగ్గించారని, సరేండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయని, స్టేషన్ అలవెన్స్ పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. పోలీసు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డులు పనిచేయడంలేదని విమర్శించారు. పోలీసులలో సమాన వేతనం లేక టీజీఎస్పీ పోలీసులు అడిగితే 10మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని దుయ్యబట్టారు.