Congress: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. మరోసారి ఆయనకే టికెట్!

by Prasad Jukanti |
Congress: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. మరోసారి ఆయనకే టికెట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: వచ్చే ఏడాది జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక (Graduate MLC Election)పై కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు గురువారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక సమావేశం జరిగింది. ఈ మీటిగ్ కు ఏఐసీసీ ఇన్ చార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ ముక్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు తదితర హాజరయ్యారు. ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం రాబోయే మార్చిలో ముగియబోతున్నది. ప్రతిపక్షంలో ఉండగా జయ కేతనం ఎగురవేసిన ఈ స్థానాన్ని అధికార పక్షం హోదాలో ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగాంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ్టి భేటీలో నేతలు చర్చించారు. జిల్లాకు ఓ ఇన్ చార్జిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఓటర్ల నమోదు గడువు తేదీని వచ్చే నెల 9 వరకూ పొడిగించిన నేపథ్యంలో తమ అనుచరులతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ సూచించింది.

జీవన్ రెడ్డికి మరోసారి ఛాన్స్:షబ్బీర్ అలీ

ఈ భేటీ అనంతరం గాంధీ భవన్ లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని నిలబెట్టాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఎన్ రోల్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

త్వరలో అభ్యర్థిపై నిర్ణయం:జీవన్ రెడ్డి

పట్టభద్రుల అభ్యర్థి ఎంపిక వ్యూహాలను సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) చెప్పారు. 42 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగిందని తెలిపారు. మళ్ళీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే విషయంపై కసరత్తు చేశామని పార్టీ నన్ను కూడా సంప్రదించిందని వెల్లడించారు. త్వరలో అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. పది నెల్లోనే 53 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story