- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
23 తర్వాతే కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు.. ఆ సంగతి తేలేదాకా పెండింగ్‌లోనే..?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ఫస్ట్ లిస్టు సెప్టెంబరు 23 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ పరిస్థితులు పూర్తిగా తేలే వరకు లిస్టును పెండింగ్‌లో ఉంచాలని పార్టీ భావిస్తున్నది. లిస్టు తయారైనా.. పార్టీ నుంచి ఆఫీషియల్‌గా ఎలాంటి రిలీజ్ ఉండదు.సెషన్స్ తర్వాతనే ప్రకటించేందుకు పార్టీ మొగ్గు చూపనున్నది.
ఇప్పటికే పీఈసీ కమిటీ సమీక్ష పూర్తయింది. సోమవారం నుంచి స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు స్కూట్నీ తర్వాత ఒక లిస్టును తయారు చేయనున్నారు. ఆ జాబితాను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపనున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఆ లిస్టు వచ్చే పది రోజులలోపే సిద్ధం కానున్నది. కానీ బయటకు మాత్రం ఈ నెల 23 తర్వాతనే పార్టీ ప్రకటించాలనుకుంటుందని ఓ నేత తెలిపారు.
ఏలా ఉంటుందో..?
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా కోసం పార్టీ లీడర్లతో పాటు కేడర్ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. గెలుపు గుర్రాలతోనే ఫస్ట్ లిస్టు ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు గతంలో అనేక సార్లు వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు ఈ లిస్టులో ఉంటారని పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలనే తొలి విడత ప్రకటిస్తామని పార్టీ చెప్పుకొచ్చింది.
అయితే ఈ లిస్టు ఫార్మాట్ ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఏ, బీ, సీ విధానంలో వెల్లడిస్తామని పార్టీ స్పష్టం చేసింది. పక్కా గెలుపు గుర్రాలను ఏ, కొద్ది శాతం కష్టబడితే గెలిచే సీట్లను బీ, టఫ్సెగ్మెంట్లను సీ కేటగిరీల్లో ప్రకటిస్తామన్నారు. కానీ ఇప్పుడు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని? చాలా మంది నేతలు సందేహంలో ఉన్నారు.