- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Congress : అధికారం పోతే ఇంత దిగజారిపోవాలా..? హరీష్ రావు పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం పోతే ఇంత దిగజారిపోవాలా హరీష్ రావు గారు.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఓ వీడియో షేర్ చేసింది. కేసీఆర్ గారడి తెలుసు, కేటీఆర్ డ్రామాలు తెలుసు, కానీ హరీష్ రావు కూడా గాడి తప్పి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించింది. మీ ఓటమిని అంగీకరించకుండా ఇంకెన్నాళ్ళు ఈ నాటకాలు.. ఇకనైనా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోండి.. అని తెలిపింది.
మీరెంత అవివేకో అర్థం అవుతుంది..
పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ జర్నలిస్టులతో ప్రచారం చేయించుకున్నది మీరు.. మిమ్మల్ని రెండు దఫాలు గెలిపిస్తే, తెలంగాణ ప్రజలను ఆగం చేసి, దోచుకు తిన్నారని విమర్శించింది. మీ దొర అహంకారాన్ని అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.. అని పేర్కొంది. ప్రజలు ఏర్పరుచుకున్న ప్రజా ప్రభుత్వం పై బురద జల్లడం అంటే, మీరెంత అవివేకో అర్థం అవుతుంది. అధికారం పోతే ఇంతలా వెక్కి వెక్కి ఏడ్చే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం.. అని తెలిపింది. కేటీఆర్ ఏమో రెండు సార్లు మీకు అధికారం ఇచ్చిన ప్రజలని తెలివి తక్కువ వారు అని అంటారని, మీరేమో యూట్యూబ్ ఛానెళ్లు అంటారని తెలిపింది. ఏమేం తప్పులు చేశారో తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళని చూశా కానీ.. మీ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇలాంటి కారణాలు చెప్పి దుష్ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పదం.. అని ఎక్స్‌లో హరీష్ రావుకు ట్యాగ్ చేసింది.