vettaiyan: ఓటీటీలోకి రాబోతున్న 'వేట్టయన్' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

by Prasanna |
vettaiyan: ఓటీటీలోకి రాబోతున్న వేట్టయన్ మూవీ..  స్ట్రీమింగ్ డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'వేట్టయన్' మూవీ దసరా కానుకగా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 'జై భీమ్' సినిమా ఫేమ్ జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 10 న థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా తమిళంలో తప్ప మిగతా అన్ని భాషల్లో పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ఇప్పుడు నెల కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

'వేట్టయన్' మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకుంది. కానీ, మేకర్స్ ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. నవంబర్ 7 న 'వేట్టయన్' ఓటీటీలోకి రాబోతున్నట్టు టాక్ బాగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలిసిన సమాచారం.

Advertisement

Next Story

Most Viewed