‘అక్కడినుంచే ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది.. వెంటనే తనిఖీలు చేయండి’

by GSrikanth |
‘అక్కడినుంచే ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది.. వెంటనే తనిఖీలు చేయండి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పలువురు నేతలతో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ గురువారం డీజీపీకి ఫిర్యాదు పత్రం అందించారు. అనంతరం సుధాకర్ గౌడ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే సామాజికవర్గ అధికారులతో ఫోన్‌లు ట్యాప్ చేయించారని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచి ఇప్పటికీ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వెంటనే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాలని కోరారు. ఫోన్‌లు ట్యాప్ చేసి వేల కోట్లు డబ్బులు వసూలు చేశారని అన్నారు. ప్రముఖులు, వ్యాపార వేత్తల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దని.. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story