- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడ్ ఉల్లంఘించిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటి చేసే క్యాండియేట్‌ను పల్లి, బఠాని అనడం ఏందని? ప్రశ్నించారు. ఇది రూల్స్‌ను అతిక్రమించినట్లేనని మల్లు రవి స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లు రవి శనివారం చీఫ్ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ..
బీఆర్ఎస్ అభ్యర్థి బిట్స్ పిలాని అయితే ఆ కాలేజీల్లో మాత్రమే ఓట్లు అడగాలని సూచించారు. తీన్మార్ మల్లన్నను పల్లి, బఠాని అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఇక జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సోనియాగాంధీ వస్తున్నారని, ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్‌కౌశిక్ యాదవ్, మీడియా సెక్రటరీ మామిడి గోపీలు ఉన్నారు.