ఓటేసెముందు గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-30 16:26:01.0  )
ఓటేసెముందు గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్ ఆలస్యమవుతోంది. అయితే మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు వేయడానికి ముందు ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి గ్యాస్ సిలిండర్ కు పూజలు చేశారు. గ్యాస్ సిలిండర్ కు పూల దండ వేసి రూ.500 నోటును అతికించారు. అయితే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రూ.500లకే సిలిండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని సందేశం ఇచ్చేలా పొన్నం వెరైటీగా ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ కండువా వేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడం దుమారం రేపింది.

Advertisement

Next Story