- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam Prabhakar : హైదరాబాద్ కు గోదావరి నీళ్ళు తెచ్చిందే కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్ళలో బీఆర్ఎస్ చేయలేని పనులను ఒక ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ కు తాగు నీటిని తీసుకు వచ్చిన మిషన్ భగీరథ(Mission Bhagiratha) కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టిందేనని, బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన నీళ్ళు, గాలి ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తాపత్రయమని తెలియజేశారు. నగర పౌరులకు స్వచ్ఛమైన గాలి ఇచ్చే ఉద్దేశంతో పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి ఈవీ వాహనాలు తీసుకు వచ్చేందుకు నూతన విధానం(EV Policy) ప్రవేశ పెట్టారు. బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి హైదరాబాద్ కు ఒక్క రూపాయిని కూడా తేలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే అనేక పథకాలు తీసుకు వచ్చి ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని అన్నారు.
- Tags
- ponnam prabakar