- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సస్పెండ్ చెయ్యరు.. మైక్ ఇవ్వరు ఇది కరెక్ట్ కాదు.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయినప్పటికి స్పీకర్ తమను పట్టించుకోవడం లేదని, అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సభలో ఎస్సీ వర్గీకరణ తీర్పుపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ను కోరగా.. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలని సభ్యులను సూచించారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నిన్నటి సభలో సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకువచ్చారు కాబట్టి.. క్లారిఫై చేసుకోవాల్సిన హక్కు ఆమెకు ఉంది. ఆమెకు మైక్ ఇవ్వలేదు సరే.. కనీసం సభను క్రమశిక్షణలో పెట్టండి. లేదా సభ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేయాలి అంటే చెయాలి.. కానీ.. వారిని సస్పెండ్ చెయ్యరు.. మైక్ ఇవ్వరు.. ఇది కరెక్ట్ కాదు అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ సూచించారు.