TG Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

by Mahesh |   ( Updated:2024-07-30 07:27:55.0  )
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్ల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ.. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు సమగ్ర శిక్ష ఉద్యోగులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పర్మినెంట్‌ చేస్తామని మాట ఇచ్చి తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story