- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lagacharla victims : ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల దాడి కేసు బాధితులు(Lagacharla victims)ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC and ST Commission)ను కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పలువురు బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిసి పోలీసులు వారిపై చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు మహిళలు ఫిర్యాదు చేశారు. కాగా మహిళా అధికారిణితో బాధిత మహిళల నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కమిషన్ ను కోరారు. అందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంగీకరించింది.
కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామని, దోషులను కమీషన్ వదిలిపెట్టదని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనన్నారు.