- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డొనేషన్ పేరిట రూ.కోట్లలో వసూళ్లు! ‘జోసెఫ్’ స్కూల్ దోపిడీ దందా
దిశ, రంగారెడ్డి బ్యూరో: విద్యా వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థలో బందీగా మారింది. నిరుద్యోగులు ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోవాలంటే రూల్స్, రెగ్యులరైజేషన్ వర్తిస్తాయి. అనుమతులు వచ్చే వరకు అడ్మిషన్లు తీసుకోకుండా ఇబ్బందులు గురిచేస్తోంది. అదే పెట్టుబడిదారులు, చదవుతో సంబంధం లేని వ్యక్తులు లాభాల కోసం ఏర్పాటు చేసుకునే స్కూల్స్‌కు ఎలాంటి నిబంధనలు ఉండవు. ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులాగా ఏర్పాటవుతున్నాయి.
అలాంటి స్కూల్స్ ఏర్పాటులో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తారు. అదే నిరుద్యోగి అప్పులు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు విద్యాధికారులు భంగం కల్పిస్తున్నారు. కాసులిస్తే అన్ని మాఫీ అనే కోణంలో జిల్లా విద్యాశాఖ నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతుంది.
ఏ ప్రతిపాదికన అనుమతినిచ్చారు...
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో భవన నిర్మాణం పూర్తి కాలేదు. గోడలు నిర్మించి వదిలిపెట్టారు. అలాంటి సమయంలో మున్సిపాలిటీ అధికారులు కేవలం ప్రొవిజనల్ ఫైర్ ఎన్వోసీ మాత్రమే ఆ భవనానికి ఇచ్చారు. ఆ సర్టిఫికెట్తో ఎలా అనుమతినిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో భవనం కాకముందే అడ్మిషన్లు తీసుకునేందుకు జిల్లా, మండల విద్యాశాఖాధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా కాసులతో రాజీపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఆ భవన నిర్మాణం పూర్తికాలేదని స్పష్టమైతుంది. జీ ప్లస్2 మాత్రమే పూర్తిస్థాయిలో భవనం కాగా.. మిగిలిన రెండు ఫ్లోర్ల లోపల గోడలే ఉన్నాయని తెలుస్తోంది.
డీఈవో, ఆర్జేడీలు పొంతనలేని అనుమతులు..
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కాల్వంచలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌ను నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్నారు. ఈ స్కూల్స్‌కు అనుమతులు ఇవ్వడంలో జిల్లా విద్యాశాఖ, ఆర్జేడీలు తొందరపాటు వహించినట్లు స్పష్టమవుతుంది. జీప్లస్ బిల్లింగ్ 18.45 మీటర్ల ఎత్తులో ఉండే భవనానికి ప్రొవిజనల్ ఫైర్ ఎన్వోసీతో జిల్లా విద్యాశాఖ పీపీ నుంచి 7వ తరగతి వరకు అనుమతినిచ్చింది. అదేవిధంగా 6 మీటర్ల ఎత్తుకు తక్కువ భవనం ఉందని ఫైర్ఎన్వోసీతో సంబంధం లేకుండానే 8వ తరగతికి ఆర్జేడీ అనుమతినిచ్చారు.
అక్యూపెన్సీ ఫైర్ ఎన్వోసీ లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు పీపీ నుంచి 7వ తరగతి వరకు 2022–2023లో, 2023–24కు ఆర్జేడీ అనుమతులిచ్చింది. ఈ అనుమతులపై చైల్డ్ రైట్స్‌ఫోరం ఆధ్వర్యంలో 2022 మే 2022న జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేస్తే 20వ తేదీన సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌ను సీజ్‌చేశారు. కానీ అదే విద్యాశాఖ అధికారులు ఎలాంటి అక్యూపెన్సీ సర్టిఫికేట్ లేకుండా వెనవెంటనే రీ ఓపెన్ చేయడంపై అనుమానాలకు తావునిస్తుంది.
సేవా సంస్థ పేరుతో దోపిడీ..
జీవో 1, 1994కు విరుద్ధంగా స్కూల్ నడిపించడమే కాకుండా విద్యార్థుల వద్ద భారీ స్థాయిలో ఫీజులు వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సేవా చేస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు తోడ్పాడుతున్నామని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు.
కానీ అందుకు విరుద్దంగా ఆ యాజమాన్యం స్కూల్ నడిపించడం గమనార్హం. ప్రతి విద్యార్థి వద్ద డోనేషన్ పేరుతో రూ.61వేలు వసూల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ స్కూల్లో 1072 మంది విద్యార్థుల దగ్గర నుంచి ఇప్పటి వరకు రూ.6.54కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీఈ – 2009 నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.