- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cocaine: జన్వాడ ఫామ్‌హౌజ్‌లో కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్(Drugs) వ్యవహారంలో మోకిలా పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి(Vijay Madduri) నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు జరుపుతున్నారు. జన్వాడ ఫామ్‌హౌజ్ పార్టీ(Janwada Farmhouse Party) డ్రగ్స్ టెస్టులో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. రాజ్ పాకాల(Raj Pakala) ఫామ్‌హౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్(Cocaine) తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, గత ఆదివారం మోకిల, శంకర్‌పల్లి, నార్సింగి, ఎస్‌వోటీ పోలీసులు నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో జన్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్(KTR) బావమరిది అయిన రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో దాడులు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.
పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎ్‌ఫఎల్ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన కొకైన వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు మరోవైపు ఈ కేసులో రాజ్ పాకాలకు ఇప్పటికే మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పార్టీకి సంబంధించిన వివరాలు చెప్పాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.