CMR Shopping Mall: బీహెచ్ఈఎల్‌లో అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్.. సందడి చేసిన హీరో రామ్ పోతినేని

by Shiva |
CMR Shopping Mall: బీహెచ్ఈఎల్‌లో అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్.. సందడి చేసిన హీరో రామ్ పోతినేని
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌ బీహెచ్ఈఎల్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్య, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రిబ్బన్ కట్ చేసి షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ టీపీసీసీ జనరల్ సెక్రటరీ జైపాల్‌రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కట్టా శ్రీనివాస్ గౌడ్, ల్యాండ్ లార్డ్ నదీం ఉల్లా ఖాన్ హాజరయ్యారు. షాప్ ఓపెన్ అవ్వగానే మొదటి కొనుగోలును వజ్రం కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కోల అంజనేయులు ఆరంభించారు.

ఈ సందర్భంగా సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ 31వ షోరూంను బీహెచ్‌ఈఎల్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంఆర్‌లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల అభిరుచి మేరకు వారికి కావాల్సిన మోడల్స్ అతి తక్కువ ధరలకే అందించటం సీఎంఆర్ స్పెషాలిటీ అని తెలిపారు. సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సీఎంఆర్ ఇస్తుందని పేర్కొన్నారు.

అనంతరం సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. తన 31వ షోరూం బీహెచ్ఈఎల్‌లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంఆర్ అంటేనే ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయని తెలిపారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయ అన్నారు.

సీఎంఆర్ షాపింగ్ ప్రారంభోత్సవ వేడుకలో సినీ హీరో రామ్ పోతినేని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎంఆర్ గత 40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీకి, డిజైన్లకు ప్రత్యేకంగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. సీఎంఆర్ అంటే కుటుంబమంతా మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందు ఎగబడ్డారు.











Advertisement

Next Story

Most Viewed