- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై సీఎం రేవంత్ సమీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న రీజనల్ రిగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా బుధవారం ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై ఎన్ హెచ్ఏఐ దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తులు చేయగా త్వరలోనే ఆమోదం రానున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు ఈ రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రాజెక్టును రహదారుల కార్యాచరణ ప్రణాళికలో చోటు కల్పించింది. ఈ నిర్ణయంతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరగనున్నాయి.