కవిత అరెస్ట్‌పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్

by Ramesh N |   ( Updated:2024-03-16 08:29:37.0  )
కవిత అరెస్ట్‌పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నారు. కవిత అరెస్ట్ చేయడం ద్వారా ఆ క్రెడిట్ ను బీజేపీ, అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ సానుభూతిని పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా అయినా కేసీఆర్ స్పందించ లేదన్నారు.

కవిత అరెస్ట్ పై కేసీఆర్, నరేంద్ర మోడీ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలవబోతున్నదని అన్ని సర్వేలు చెబుతున్నాయని అందువల్ల కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే బీఆర్ఎస్, బీజేపీ ఈ చీఫ్ పొలిటికల్ డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇకనైనా మోడీ, కేసీఆర్ ఈ డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారని కానీ నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారని సెటైర్ వేశారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ నిరంతర ధారావాహిక సీరియల్ లాగా లిక్కర్ స్కామ్ నడిపిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story