ORR మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు బ్రేకులు వేయనున్న సీఎం రేవంత్?

by Prasanna |   ( Updated:2023-12-13 08:12:47.0  )
ORR మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు బ్రేకులు వేయనున్న సీఎం రేవంత్?
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి సంచలన నిర్ణయాలతో తమదైన మార్క్ పాలనను కనబరుస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే .. సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ORR మెట్రో ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం.హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రో విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించేందుకు గత ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో లైన్‌కు గ్రీని సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది. అయితే తాజాగా.. ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్ బ్రేకులు వేయనున్నారని తెలుస్తుంది . రాయదుర్గ్-విమానాశ్రయం మార్గాన్ని రద్దు చేసి.. పాత నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారట. దీని వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటందనేది సీఎం రేవంత్ ఆలోచన. అయితే దీనిపై అధికారింగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Next Story