రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. హరీష్ రావుకు CM రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 4 |
రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. హరీష్ రావుకు CM రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. తాజాగా బుధవారం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. భూమి బద్ధలైనా అగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని.. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీ ఉండు అన్నారు. రామప్ప, సమ్మక్క సాక్షిగా ఇచ్చిన మాట తప్పం అని రేవంత్ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని.. బీఆర్ఎస్ నేతల్లా తాను తలకాయ లేని మాటలు చెప్పను అని సీఎం అన్నారు. అంతకుముందు సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు.

Read More...

అసెంబ్లీకి రమ్మంటే టీవీల్లో డిబేట్‌లా.. KCRపై CM రేవంత్ రెడ్డి సీరియస్



Next Story

Most Viewed