భారత జట్టులో చోటు దక్కించుకున్న తెలంగాణ బిడ్డలు.. CM రేవంత్ స్పెషల్ గ్రీటింగ్స్

by Gantepaka Srikanth |
భారత జట్టులో చోటు దక్కించుకున్న తెలంగాణ బిడ్డలు.. CM రేవంత్ స్పెషల్ గ్రీటింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియా(Malaysia) వేదికగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్(Under-19 T20 World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నిలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. దీంతో వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్(Team India), ఆతిథ్య మలేషియా, వెస్టిండీస్, శ్రీలంక జట్లు గ్రూప్-Aలో ఉన్నాయి. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లను ఆడనుంది.

ఇదిలా ఉండగా.. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు(త్రిష, ధృతి) యువతులు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన మరో యువతి కూడా స్థానం సంపాదించుకున్నది. దీంతో వీరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ప్రపంచకప్‌లో మంచి ప్రతిభ కనబర్చాలని, అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు.


Advertisement

Next Story