ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ.. సోమాజిగూడలో విగ్రహానికి సీఎం నివాళులు

by Ramesh N |
ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ.. సోమాజిగూడలో విగ్రహానికి సీఎం నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఇవాళ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వీహెచ్, షబ్బిర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచి లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన రాజీవ్ గాంధీకి నివాళులు అని వీడియో విడుదల చేశారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరుపున ఘనంగా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

Advertisement

Next Story