- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మళ్లీ జగన్ గెలుస్తాడన్న KCR.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ సీఎం జగన్ గెలుస్తాడని తమకు సమచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం ఓ టీవీ ఛానెల్ రిపోర్ట్‌తో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఉన్న అసూయతోనే కేసీఆర్ ఆ తరహా వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఓ జట్టుగా ఉండి వ్యవహారిస్తు్న్నారని అన్నారు. కేసీఆర్ అబద్ధపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మటం లేదన్నారు. తెలంగాణను కేసీఆర్‌కు రూ.69 వేల కోట్ల అప్పుతో అప్పగించాం.. ఆయన రూ.7 లక్షల కోట్లతో తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పగించారని చెప్పారు.
తీవ్ర కరువు, ఎండిన రిజర్వేషన్లు కేసీఆర్ మాకు అప్పగించారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కాంగ్రెస్‌కు అంటగట్టడం బీఆర్ఎస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. గడిచిన నాలుగు నెలల్లోనే కేసీఆర్ చేసిన అప్పులకు రూ.26 వేల కోట్ల వడ్డీలు కట్టామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మాకు ప్రధాన పోటీ బీజేపీతోనేనని స్పష్టం చేశారు. దేశంలోని అవినీతిపరులంతా బీజేపీలోనే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.