- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఒక్క క్షణం కూడా కిషన్ రెడ్డి తెలంగాణలో ఉండటానికి వీళ్లేదు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం హన్మకొండ(Hanamkonda)లో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఇన్నాళ్లూ కిషన్ రెడ్డిపైన కొంత గౌరవం ఉండేదని.. అది కూడా పోగొట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక ఆయన తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్(Gujarat)కు వెళ్లిపోవాని సూచించారు. గుజరాత్ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. ఒక్కసారి కాదు.. పదిసార్లు ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకున్నా తప్పులేదని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాళోజీ నారాయణ రావు బతికి ఉంటే కేసీఆర్(KCR), కిషన్ రెడ్డిలను తెలంగాణ నుంచి తరిమివేసే వారని అన్నారు.
అంతేకాదు.. ఇక రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వనని సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కుట్రలన్నీ తమకు తెలుసని అన్నారు. ‘ఇప్పటికే నీ కుర్చీ లాక్కున్నా.. నిన్ను వదిలేది లేదు’ అని కేసీఆర్‌కు హెచ్చరిక జారీ చేశారు. బిల్లా-రంగా రండి.. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ పెడదాం కేటీఆర్, హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ చేశారు. కేటీఆర్ రామారావు కాదు.. పెద్ద డ్రామారావు విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వరంగల్‌ను హైదారాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. ఇప్పటికే రూ.6 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధికి పొంగులేటి ఎంతో కృషిచేస్తున్నారని అభినందించారు.