- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ వేళ బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో సునామీ రాబోతున్నదని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని, యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కొడంగల్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, ఎన్డీయే పత్తాలేకుండా పోతుందన్నారు. సౌత్ ఇండియాలో బీజేపీకి 15-20 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అని ఇండియా అలయన్స్ విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదన్నారు. కేసీఆర్ కేఏ పాల్ మాదిరిగా మాట్లాడుతున్నారని మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని చెప్పారు. 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయని ఏజ్ లిమిట్ అణలు చేస్తే బీజేపీలో ప్రధాని ఎవరో బీజేపీ తేల్చుకోవాలని అన్నారు.
కౌన్ నామ్ దార్ కౌన్ కామ్ దార్?:
నరేంద్ర మోడీ దేశ ప్రజలను మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ డిబెట్ కు పిలిస్తే తాము నామ్ దార్ కాదు కామ్ దార్ అని మోడీ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే... మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఇందులో ఎవరు నామ్ దార్? ఎవరు కామ్ దార్ అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని పప్పు అని హేళన చేశారు. కానీ అదే పప్పుతో డిబెట్ కు రమ్మంటే పారిపోతున్నారని విమర్శించారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమన్నారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని రాబోయేతి సునామీయే అన్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న బీజేపీ 400 సీట్లు ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఒక వీడియో వైరల్ కేసులో మాపై రంగంలోకి దిగిన ఎంహెచ్ఏ మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ చేసినా బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదని దుయ్యబట్టారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం అని బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? అని నిలదీశారు. కాంగ్రెస్ కు ఆదానీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోడీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఎన్ఐఏను అడ్డుగా పెట్టుకుని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఇప్పుడు ఢిల్లీ పోలీసుల ద్వారా భయపెట్టాలని చూస్తోందన్నారు.